Site icon NTV Telugu

KA Success Meet: “క” సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటున్నమూవీ టీమ్

Ka

Ka

KA Success Meet: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఓ సరికొత్త ప్రయత్నంగా థ్రిల్లర్ సినిమా “క” ను సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఇకపోతే, తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర సినిమా మెంబర్స్ పాల్గొన్నారు.

Also Read: IPL Retention 2025: 10 ఫ్రాంఛైజీలు విడుదల చేసిన ఆటగాళ్లు వీళ్లే..

ఈ సందర్బంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ .. “క” సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా సినిమాకు ఎంతో సపోర్ట్ లభిస్తోందని, “క” సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారని తెలిపాడు. సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసిన వంశీకి థ్యాంక్స్ చెబుతూ.. అలాగే డైరెక్టర్స్ సుజీత్, సందీప్ సాధించిన ఈ విజయానికి వాళ్ల పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు హీరోయిన్స్ తన్వీ రామ్, నయన్ సారిక బాగా నటించారని, “క” సినిమా బిగినింగ్, ఎండింగ్ మిస్ కావొద్దని తెలిపాడు. సినిమా చివరలోనే కథలోని ఎస్సెన్స్ ఉందని, రోలింగ్ టైటిల్స్ వరకు సినిమా చూడండని తెలిపాడు.

Read also: IPL Retention 2025: ముగ్గురు టీమిండియా స్టార్లకు షాక్.. కెప్టెన్సీ పాయే

Exit mobile version