Site icon NTV Telugu

Palaniswami: బెజవాడ దుర్గమ్మ సేవలో మాజీ సీఎం పళనిస్వామి

Palaniswami

Palaniswami

Palaniswami: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే నేత పళనిస్వామి.. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు.. ఇక, పళనిస్వామికి ఘనస్వాగతం పలికారు దుర్గగుడి ఆలయ అధికారులు.. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేశారు.. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు ఆలయ అధికారులు..

Read Also: Singareni Elections: అక్టోబర్ లో కష్టం.. నేడు సింగరేణి ఎన్నికలపై వీడనున్న సస్పెన్స్..

ఇక, అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.. దర్శనానికి మాత్రమే వచ్చాను.. రాజకీయాల గురించి మాట్లాడను అని స్పష్టం చేశారు.. మరీ ముఖ్యంగా ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే బయటకి రావడంపై ఇక్కడ మాట్లాడబోనని తేల్చేశారు. రాజకీయాలు గుడిలో మాట్లాడకూడదన్నారు పళనిస్వామి. కాగా, తమిళనాడులో మాజీ సీఎం జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరైంది.. గత ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి.. కానీ, అన్నా డీఎంకేకు ఊహించని షాక్‌ తగిలి.. డీఎంకే గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టు తాజాగా అన్నా డీఎంకే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Exit mobile version