NTV Telugu Site icon

K.Keshava Rao : నేను 55 ఏళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నా.. నన్ను cwc మెంబర్‌గా చేసింది కాంగ్రెస్

Keshava Rao

Keshava Rao

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. అయితే.. కీలక నేతలు పార్టీ వీడడం ఆ పార్టీని మరింత బలహీనపరుస్తుంది. బీఆర్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కె. కేశవరావు మాట్లాడుతూ.. నేను 55 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నానని, నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ నుంచి ఇంఛార్జి గా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నన్ను cwc మెంబర్ గా చేసింది కాంగ్రెస్ అని, మొదట 1998 లో 40 మంది ఎమ్మెల్యే లతో సోనియాగాంధీ కి తెలంగాణ కోసం లెటర్ ఇచ్చామన్నారు కె.కేశవరావు. కాంగ్రెస్ ఎంపీలుగా తెలంగాణ కోసం ఎంతగానో కొట్లాడినమని, పబ్లిక్ లో తెలంగాణ ఉద్యమం ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌లో జాయిన్ అవ్వాలి అనే ప్రతిపాదన వచ్చిందన్నారు కె.కేశవ రావు. 55 ఏళ్ల తర్వాత trs లో జాయిన్ అయ్యానని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ కావాలంటే ఎక్కువ ఎంపీ లు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటంతో టర్ల5బిల్ పాస్ అయిందని, నేను కొన్ని కారణాల వల్ల ఆరోజు బీఆర్‌ఎస్‌ కు వెళ్ళానని ఆయన తెలిపారు.

అయితే.. నిన్న కేసీఆర్ ను కలిశానని, మీరు పార్టీ ని విడిచి పోవద్దు అన్నారని, తీర్థ యాత్ర ముగిసింది అనుకుంటున్నానని, ఇప్పుడు నా సొంత పార్టీ కి వస్తున్నానన్నారు. ఈ పార్టీ లోనే నా తుది శ్వాస వరకు ఉంటానని, బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను అని కేసీఆర్ నా ముందే సోనియాగాంధీ కి చెప్పారని, కానీ ఆయన విలీనం చేయలేదన్నారు. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 64 సార్లు రాజ్యసభ సమావేశాలకు వెళ్ళానని, బీఆర్‌ఎస్‌ నుంచి 16 సార్లు మాత్రమే వెళ్ళానని, కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి లోకి వెళ్లాలని కేసీఆర్ కు చెప్పానని, కానీ కేసీఆర్ మాత్రం నా మాట వినలేదన్నారు. రేపు మా కూతురు విజయ లక్ష్మి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని, నేను ఢిల్లీ నాయకుల తో చర్చించి న తర్వాత జాయినింగ్ డేట్‌ చెప్తానన్నారు. నాకు పార్టీ మారడం పై విప్ ఇస్తే… అందుకు సమాధానం చెబుతానని, నాకు కేసీఆర్ రాజ్యసభ మాత్రమే ఇచ్చారన్నారు. మొదటిసారి రాజ్యసభ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వేసిన రెండవ ప్రాధాన్యత వోటు తోనే గెలిచానని ఆయన అన్నారు.