బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధికార ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షుల మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి
జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సామాన్య వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తున్నాడని, 76 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. అంతేకాకుండా.. 570 రూట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. మారుమూల ప్రాంతాల్లో విమానాశ్రయాల కనెక్టివిటీ పెరిగిందన్నారు. ప్రపంచంలోనే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్
కలిపి ఐదోస్థానంలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. 2030 కల్లా సివిల్ ఏవియేషన్లో మూడో స్థానానికి రావడమే లక్ష్యమన్నారు జ్యోతి రాదిత్య సింధియా. విమానాలు, విమానాశ్రయాలు, ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో 10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇస్తామని సింధియా చెప్పారు. డ్రోన్లకు 80శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బోయింగ్, ఎయిర్ బస్ నుంచి ప్రపంచస్థాయి విమానాలను పలు సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంతో ప్రపంచస్థాయిలో దేశ పౌరవిమానయాన ఘనత చాటి చెప్పొచ్చని ఆయన అన్నారు. 2030 కల్లా 30కోట్ల మందిని విమానయనాన్నికి దగ్గర చెయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కొనుగోలు చేస్తోందని.. మన దగ్గర 57 ఫ్లయింగ్ ట్రెడ్ ఆర్గనైజేషన్ లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 28 న కరీంనగర్ కి అమిత్ షా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
