NTV Telugu Site icon

Canada: “జీ20 సమావేశాలకు వచ్చినప్పుడు కెనడా ప్రధాని కొకైన్ తీసుకువచ్చారు”

Canada Prime Minister Justin Trudeau

Canada Prime Minister Justin Trudeau

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆయన వెల్లడించారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు కొకైన్ కారణంగా అతడు రెండు రోజులు బయటకు కూడా రాలేకపోయాని తెలిపారు. ఆ కారణంగా ప్రధాని ఏర్పాటు చేసిన విందుకు కూడా ఆయన హాజరుకాలేదన్నారు.

Also Read: Life Certificate For Pensioners: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంక్ ఉద్యోగులే మీ ఇంటికొస్తారు

ఇక తన భార్య ఢిల్లీలో ట్రూడోను చూసినప్పుడు ఆయన కాస్త డ్రగ్స్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని తరువాత సోషల్ మీడియాలో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రచారం జరిగిందని వోహ్రో చెప్పారు. ఇక అంతే కాదు ట్రూడో  చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తాడని, అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు కొంచెం నాలెడ్జ్ మాత్రమే ఉందని వోహ్రా పేర్కొన్నారు. ఇక తాను ఉన్న చోట్ల ఏ తప్పు జరగదని ట్రూడో అనుకుంటూ ఉంటారని అయితే తానే తప్పు చేస్తారని అర్థం వచ్చేలా వోహ్రా మాట్లాడారు. కెనడా వీసాలను రద్దు చేసి భారత్ మంచి పని చేసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇక ఈ ఆరోపణలను కెనడా ప్రధాని కార్యాలయం ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవం, తప్పుడు సమాచారమని వెల్లడించింది. మీడియా రిపోర్టింగ్ లో తప్పుడు సమాచారం ఎలా వస్తుందో చెప్పడానికి ఈ ఆరోపణలు మంచి ఉదాహరణ అని కెనడా కార్యాలయం పేర్కొందంటూ ఓ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఇక గత కొంత కాలంగా కెనడా భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ తీవ్రవాది నజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు చేయడంతో వివాదం మొదలయ్యింది. ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ దౌత్యవేత్త చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.