Site icon NTV Telugu

Justice Surya Kant: కోటీశ్వరులు..? కొత్త సీజేఐ సూర్య కాంత్ ఆస్తి ఎంతో తెలుసా..?

Justice Surya Kant

Justice Surya Kant

Justice Surya Kant: జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఆస్తుల వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ దేశవ్యాప్తంగా కోట్లాది విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు, భూమి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నగలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి గురుగ్రామ్, హిస్సార్ వరకు రియల్ ఎస్టేట్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త సీజేఐ కుటుంబం బ్యాంకు ఎఫ్‌డిలు, బంగారం, వాహనాలను కలిగి ఉంది. హిస్సార్ అనే చిన్న పట్టణం నుంచి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి ఎదిగారు సూర్యకాంత్..

READ MORE: Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..

సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందించిన వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ అనేక స్థిరాస్తులను కలిగి ఉన్నారు. చండీగఢ్‌లోని సెక్టార్ 10లో ఆయనకు ఒక ఇల్లు ఉంది.. దాన్ని కుటుంబంతో కలిసి కొనుగోలు చేశారు. పంచకుల జిల్లాలోని గోల్పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి, సుశాంత్ లోక్, గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్ 2లో రెండు ఇళ్ళు, సెక్టార్ 18సిలో మరొక ఇల్లు కూడా ఉన్నాయి. హిసార్‌లో సూర్యకాంత్‌కు వ్యవసాయ భూమి, వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంది. న్యూ చండీగఢ్‌లోని ఎకో-సిటీలో ఆయన భార్యకు 500 చదరపు గజాల స్థలం ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి హర్యానా గ్రామాల వరకు ఆస్తిలు కలిగి ఉన్నారు.

READ MORE: Baahubali The Eternal War: 2027లో థియేటర్స్‌లోకి జక్కన్న కొత్త సినిమా..

అంతే కాదు.. జస్టిస్ సూర్యకాంత్ వద్ద రూ. 4.1 మిలియన్లకు పైగా (సుమారు $1.7 మిలియన్ USD) 16 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వద్ద సమిష్టిగా సుమారు 300 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, కొన్ని ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. వాహనాల విషయానికి వస్తే జస్టిస్ సూర్యకాంత్ వ్యాగన్ఆర్ కారును మాత్రమే కలిగి ఉన్నారు. ఇది ఆయన సరళ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు.. ఈ ఆస్తులలో లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌస్‌లు లేదా విదేశీ పెట్టుబడులు లేవు.

Exit mobile version