Site icon NTV Telugu

Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌.. రేపు మేడిగడ్డలో ఉత్తమ్‌ పర్యటన

Kaleshwaram

Kaleshwaram

Kaleshwaram: జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఆయన నేడు నగరానికి రానున్నారు. 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే బ్యారేజీలను నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకునేందుకు పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కడెం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లు కేటాయించగా, ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను కూడా పరిశీలిస్తారు.

Read also: Raashii Khanna: తడి అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా

కాగా, మేడిగడ్డ బ్యారేజీలోని 16, 17వ నంబర్‌ గేట్లను బలవంతంగా ఎత్తివేసే ప్రక్రియను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్సీ (జనరల్) గుమ్మడి అనిల్ కుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఓరుగంటి మోహన్ కుమార్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. రేపు (శుక్రవారం) మంత్రి ఉత్తమ్, న్యాయమూర్తి పీసీ ఘోష్ వస్తున్నందున అక్కడే ఉండి ఏర్పాట్లు చేయనున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు 54 ఫిర్యాదులు అందాయి.

కమిషన్ తరపున మే 31లోగా కమిషన్ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను లెక్కిస్తే 54 అని తేలింది. ఇదిలా ఉండగా బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజినీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండు లేదా మూడో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
Tejashwi Yadav: నితీశ్ కింగ్ మేకరే అయితే బిహార్‌కు స్పెషల్ స్టేటస్ తేవాలి..!

Exit mobile version