Site icon NTV Telugu

TS High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌!

Justice Aparesh Kumar Singh

Justice Aparesh Kumar Singh

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ పేరును సుప్రీంకోర్టు కొలీజీయం సిఫార్సు చేసింది. ప్రస్తుతం త్రిపుర చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ అపరేష్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ బదిలీకి సుప్రీంకోర్టు కొలీజీయం ఓకే చెప్పింది. ఆయనను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ రామచందర్ రావు హైదరాబాద్ వాసి. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రాంచందర్ రావు విధులు నిర్వహించారు.

Exit mobile version