Site icon NTV Telugu

Jupally Krishna Rao : తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారు

Jupally

Jupally

కేసీఆర్ కృష్ణా నది జలాల కోసం పోరాటం చేస్తాం అని అంటున్నాడు.. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతారని.. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్.. ఇరిగేషన్ మంత్రి ఐదేళ్లు చేశారని, మామా.. అల్లుళ్లు ఇద్దరు ఇరిగేషన్ మంత్రి గా చేశారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవడం కోసం ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పునర్విభజన బిల్లు రాసింది నేనే అని కేసీఆర్ చెప్పాడని, బచావత్ ట్రిబ్యునల్ కి అనుగుణంగా కేటాయింపులు అని రాశారని ఆయన వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఎందుకు వెనక్కి తీసుకున్నారని, ఎస్‌ఎల్‌బీసీ పాలమూరు ప్రాజెక్టుల పేర్లు కూడా గెజిట్ లో లేవని, మా హక్కులు మాకు కావాలి అని ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు జూపల్లి.

 

నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా.. ఇప్పుడు సభ పెడతా అంటున్నారు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకున్నది కేసీఆర్ అని ఆయన విమర్శించారు. పైగా ఇప్పుడు మట్లాడుతున్నారని మంత్రి జూపల్లి ఫైర్‌ అయ్యారు. ప్రజలు శిక్ష వేసినా..బుద్దిరాలేదని జూపల్లి వ్యాఖ్యానించారు. నాటకాలు ఆడటంలో కేసీఆర్ దిట్టా అని, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. నీటి కేటాయింపుల డ్రామా లు వేస్తున్నాడు కేసీఆర్ అని ఆయన అన్నారు. కేసీఆర్ తన పదేళ్ల పాలన సమయంలో పాలమూరు – రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అని నిలదీశారు. కానీ కాళేశ్వరానికి ఆదరాబాదరాగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి మాత్రం అనుమతులు తెచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేసీఆర్ జలవివాదాన్ని ముందుకు తెచ్చారన్నారు.

Ponnam Prabhakar : GHMC అభివృద్ధిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది

Exit mobile version