NTV Telugu Site icon

Minister Jupalli: నియంత పాలన, డిక్టేటర్ పాలన పోయింది.. వంద శాతం న్యాయం చేస్తాం

Jupalli

Jupalli

Minister Jupalli: సచివాలయంలో తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు భాద్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి.. నీళ్లు నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమేనని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. నియంత పాలన, డిక్టేటర్ పాలన పోయింది.. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకున్నారని తెలిపారు.

Read Also: TS Ministers: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్న ముగ్గురు మంత్రులు

రాబోయే కాలంలో గత పరిపాలన కంటే భిన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన, ప్రజా పాలన ఉంటుందని చెప్పారు. శాఖ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. టూరిజం ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం పై విచారణ చేయాలని.. తొందరగా రిపోర్టు చేయాలని సంబంధిత హెచ్ఓడిని ఆదేశించామన్నారు. తొమ్మిది సంవత్సరాల అస్తవ్యస్త పాలనను తాము చక్కదిద్దాలన్నారు. ఏది చేసినా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతాళానికి పోయిది.. ఎవర్ని వదలమని హెచ్చరించారు. కాగా.. ప్రభుత్వంకు చాలా వనరులు ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు.

Read Also: NTR: ‘X’ లో ఎన్టీఆర్ ట్రెండింగ్.. ఎందుకంటే..?