NTR: ‘X’ లో ఎన్టీఆర్ ట్రెండింగ్.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: స్టార్ హీరో సినిమాలు అన్నాక.. అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాను నిర్మించే మేకర్స్ కు అభిమానులతో ఇబ్బంది లేకుండా అయితే ఉండదు. అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోతే వారిని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టరు ఫ్యాన్స్. ఇక మొన్నటికి మొన్న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వలేదని ఒక అభిమాని సూసైడ్ లెటర్ రాసిన విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం.. ఇదే పరిస్థితి ఇప్పుడు నందమూరి ఆర్ట్స్ ఎదుర్కొంటుంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ సినిమాను నందమూరి ఆర్ట్స్ మరియు యువసుధా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక కొన్నిరోజుల క్రితం దేవర టీజర్ డేట్ చెప్పనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో దేవర టీజర్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఆ టీజర్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అందివ్వలేదు. దీంతో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హర్ట్ అయ్యి.. X (ట్విట్టర్) లో ఎన్టీఆర్, దేవర హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. అప్డేట్ ఎక్కడ.. ? అంటూ మేకర్స్ ను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్ నెంబర్ 1 గా ఉండడం విశేషం. గత 30 గంటల నుంచి ఇదే పేరు ట్రెండింగ్ లో ఉంది. మరి ఇంత రచ్చ తరువాత మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తే బావుంటుంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!