NTV Telugu Site icon

Kolkata Doctor Murder Case: కోల్‌కతా అత్యాచార హత్య కేసులో ఓ జూనియర్ డాక్టర్ పాత్ర!.. ఎవరతను?

Kolkata Case

Kolkata Case

కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్‌ మరణించిన రోజున ఓ జూనియర్‌ డాక్టర్‌ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్‌రూమ్‌లో స్నానం చేసినట్లు వెల్లడించింది. అతని శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయని జూనియర్ డాక్టర్ .. అక్కడ ఉన్న నర్సులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆ జూనియర్ డాక్టర్ స్నానం చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. నర్సులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆ జూనియర్ డాక్టర్ కోసం సీబీఐ అధికారులు ఆర్జీ కర్ నర్సులను విచారిస్తున్నారు.

READ MORE: Minister Thummala: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం.. అధికారులకు మంత్రి ఆదేశం

సెమినార్ హాల్ దగ్గర బాత్‌రూమ్‌లు ఉన్నాయి. సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత ఆర్జీ కార్‌ మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ ఆదేశాల మేరకు పునరుద్ధరణ పేరుతో బాత్‌రూమ్‌ను కూల్చివేశారు. అయితే ఆ రోజు, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులోని బెడ్ నంబర్ 4 లో ఒక మహిళా రోగి ఉన్నారని జూనియర్ డాక్టర్ చెప్పినట్లు సమాచారం. పీఆర్‌బీసీ ఇస్తుండగా అతడి దుస్తులపై రక్తపు మరకలు పడ్డాయని నర్సుకు చెప్పాడు.

READ MORE:Vinayakan Arrested: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జైలర్ విలన్ అరెస్ట్?

ఆ విచారణలో రెండు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాలు ఓ నర్సు వెల్లడించినట్లు సమాచారం. ఇంతకు ముందు జూనియర్ డాక్టర్ని చూడలేదు. అంతకు ముందు స్నానం చేసిన జూనియర్ డాక్టర్ ని చూడలేదని నర్సు సీబీఐకి తెలిపినట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. అతడి పేరు తెలుసుకోవాలనుకున్నప్పుడు పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. రాత్రి 9 గంటల సమయంలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వార్డులోకి జూనియర్ డాక్టర్ ప్రవేశించాడని నర్సు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో నర్సు తెలిపినట్లు సమాచారం. వార్డులో ఉన్న ఫ్రిడ్జ్ తెరిచి ఏదో వెతకడం మొదలుపెట్టాడు. నర్సు అడగ్గా.. పీఆర్‌బీసీ కోసం చూస్తున్నానని జూనియర్‌ డాక్టర్‌ చెప్పాడు.

READ MORE:Niharika: వరద బాధితులకు మెగా డాటర్ విరాళం.. ఎంతంటే?

ఆర్జీకర్ లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను తారుమారు చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. క్రైమ్ స్పాట్ పూర్తిగా మారిపోయింది. మృతదేహం ఉన్న సెమినార్ హాల్ సమీపంలోని బాత్‌రూమ్‌ను కూల్చివేశారని స్పష్టం చేసింది. ఈ కేసులో పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. అయితే కొంతమంది జూనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఈ కేసులో వాస్తవాలను దాచిపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయం బయటపడుతోంది. ఈ జూనియర్ డాక్టర్ పాత్రలో వచ్చింది ఎవరో సీబీఐ కనుక్కోవడంలో నిమగ్నమైంది.

Show comments