NTV Telugu Site icon

TS News: రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు..

Juda Samme

Juda Samme

TS News: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. కాగా.. రేపటి నుండి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి వారు నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది .రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యార్థులు 10 వేల మంది వరకు ఉంటారు. అందులో.. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు 2500 మంది ఉంటారు. పీజీ స్పెషాలిటీ విద్యార్థులు(జూడా) 4000 మంది ఉంటారు. సీనియర్ రెసిడెంట్లు 1500 ఉంటారు.

Read Also: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుపై సీల్డ్ నివేదికను కోర్టుకు సమర్పించిన పురావస్తు ప్యానెల్

ఇదిలా ఉంటే.. రేపటి నుండి జూడాలు సమ్మెకు దిగుతుండడంతో గాంధీ ఆసుపత్రిలో పేషేంట్స్ కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యమ్నాయా ఏర్పాట్లు చేసామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

Read Also: Guvvala Balaraju: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్.. కార్యకర్తల ఆందోళన

Show comments