NTV Telugu Site icon

Kolkata rape-murder case: మమతా బెనర్జీని కలవనున్న వైద్యులు, సమ్మె విరమిస్తారా?

Kolkatadoctorcase

Kolkatadoctorcase

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేల సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు. శనివారం సాయంత్రం గంటలకు వైద్యుల ప్రతినిధి బృందం సీఎంను కలవవచ్చు. సీఎంను కలవాలని కోరుతూ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను రెండు సార్లు చర్చలకు పిలిచింది. కానీ.. సీఎం మమతా బెనర్జీతో సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంపై డాక్టర్ మొండిగా ఉన్నారు. ఈ కారణంగా సంభాషణ జరగలేదు. రెండు రోజుల క్రితం, మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయం నబన్న వద్ద సుమారు రెండు గంటల పాటు వేచి ఉన్నారు. కానీ, వైద్యులతో మాట్లాడలేకపోయారు. మరోవైపు గతంలో సమ్మెను విరమించాలని సుప్రీంకోర్టు కూడా వైద్యులను కోరింది. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మె విరమిస్తారా? లేదా అనే ప్రశ్నకు రేపు తెరపడనుంది.

READ MORE: Samantha: సమంత.. ఉమెన్ ఆఫ్ ది ఇయర్

ఇదిలా ఉండగా.. తాజాగా శనివారం మమతా బెనర్జీనే డాక్టర్లు నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వెళ్లారు. వారి డిమాండ్లను పరిశీలించి, ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన దోషులుగా ఎవరు తేలినా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘ మాకు న్యాయం కావాలి’’ అనే నినాదాల మధ్య వైద్యులను ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు. ‘‘నేను ముక్కమంత్రిగా కాకుండా మీ ‘‘దీదీ’’(అక్క)గా వచ్చాను. నా పదవి పెద్దది కాదు, ప్రజలు పెద్దవారు. నిన్న మీరింతా ఈ భారీ వర్షంలో నిరసన వ్యక్తం చేసినందుకు, నేను కూడా నిద్రపోలేదు. దయచేసి మీ డిమాండ్లను నెరవేరస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను’’అని ఆమె అన్నారు. వైద్యులతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల రోగుల సంక్షేమ కమిటీలను తక్షణమే రద్దు చేసినట్లు బెనర్జీ ప్రకటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇది నా చివరి ప్రయత్నం అని అన్నారు. సీఎం అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆందోళనకు దిగిన వైద్యులు చర్యలు జరిగే వరకు తమ డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Show comments