Amaravati: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఐఐటీ నిపుణుల నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక ఐకానిక్ కట్టడాల ప్రాంతంలోని నీటిని సీఆర్‌డీఏ తోడనుంది. ప్రస్తుతం ఐకానిక్ కట్టడాల ప్రాంతం చెరువులను తలపిస్తోంది. ఐకానిక్ కట్టడాల వద్ద 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉందని సీఆర్‌డీఏ చెప్తోంది. ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని తోడేందుకు సీఆర్డీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని పాలవాగులోకి తరలించేందుకు పిల్ల కాల్వలు తవ్వే యోచనలో సీఆర్డీఏ ఉంది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM Chandrababu: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష