ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు జరిగాయి. వాదనలు ముగిసిన అనంతరం.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అంతేకాకుండా.. క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
TG High Court: కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్..
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు
- తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
- తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం.
Show comments