తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జిల్లా జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వార్షిక బదిలీల్లో భాగంగా పెద్ద సంఖ్యలో జిల్లా సెషన్స్ జడ్జీలను ట్రాన్స్ పర్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 41 మంది డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జీలను బదిలీ చేసింది. వీరంతా ఈ నెల 26న బదిలీ స్థానాల్లో బాధ్యతలను స్వీకరించాలని సూచించింది. ఈ లోగా విచారణ పూర్తి చేసి తీర్పులను రిజర్వు చేసిన కేసుల్లో తీర్పులు వెలువరించాలని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Also Read : Men In Black: బ్లాక్ డ్రెస్ లో స్టార్ హీరోలు.. ఏ రేంజ్ లో ఉన్నారో మీరే చెప్పండి
అయితే గతంలో కూడా తెలంగాణ హైకోర్టు 55 మంది జిల్లా జడ్జీలను కూడా బదిలీ చేసింది. రాష్ట్రంలోని వివిధ కోర్టులు, సెషన్స్ కోర్టు జడ్జీలు బదిలీ అయ్యారు. మొత్తంగా 55 మందిని బదిలీ చేస్తూ నూతన పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. బదిలీ అయిన వారు తమకు కేటాయించిన పోస్టుల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read : Encounter Pradesh: యోగి హయాంలో ఎన్‌కౌంటర్లు.. యూపీ పోలీసుల లెక్కలు ఇవే..
అయితే ఆయా జిల్లాలకు చెందిన జడ్జీలు తాము వాదించిన కేసులను త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు వెల్లడించింది. దీంతో పాటు ఇప్పటికే కేసులో విచారణ పూర్తి అయితే దానిపై తీర్పును ఇవ్వాలంటూ వెల్లడించింది. ఒకవేళ విచారణలో ఉన్న కేసులను తీర్పును రిజర్వ్ చేసి ఉంటాలని పేర్కొంది. వాటితో పాటు తమకు కేటాయించిన పోస్టుల్లో 26వ తారీఖు వరకు వెళ్లి బాధ్యతలను స్వీకరించాలని వెల్లడించింది. దీంతో కొత్త జడ్జీలు వచ్చే వరకు కేసులు పెండింగ్ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.