Site icon NTV Telugu

Hyderabad: జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో లొల్లి.. విష్ణు vs అజారుద్దీన్..!

Jublihills

Jublihills

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహమత్ నగర్ లో అజారుద్దీన్‌ వర్గం సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వర్గం ఎంట్రీ ఇచ్చారు. విష్ణుకు చెందిన నియోజకవర్గంలో కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్‌ ఎలా పెడతారంటూ నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోగా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిచారు.

Poultry Farm: కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా?.. ఇది మీ కోసమే..

మరోవైపు జూబ్లీహిల్స్ నిజయోకవర్గం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మహమద్‌ అజారుద్దీన్‌ 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో మోరాదాబాద్‌(యూపీ) నుంచి ఎంపీగా గెలిచారు. మరోవైపు 2019లో సికింద్రాబాద్‌ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినా.. అతనికి సీటు దక్కలేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్‌.. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వినిపిస్తోంది.

Exit mobile version