Site icon NTV Telugu

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు సర్వ సిద్ధం.. ఫలితంపై ఉత్కంఠం..!

Jublihills

Jublihills

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

READ MORE: Bihar Assembly Election Results: నేడే బీహార్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించేనా..?

మొదటిగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం ప్రక్రియ రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్లు 1,94,621. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. ప్రతి దశలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజల దృష్టి కౌంటింగ్ కేంద్రంపైనే నిలిచింది. ఎవరి వైపు ప్రజాభిప్రాయం మొగ్గుచూపిందన్నది ఇంకొద్ది గంటల్లోనే తేలనుంది.

READ MORE: Koti Deepotsavam Day 13 : సర్వతోముఖాభివృద్ధి కటాక్షం “మధురై మీనాక్షి కల్యాణోత్సవం”

 

Exit mobile version