Site icon NTV Telugu

Jubilee Hills Bypoll: 139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..!

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రోన్ల ఏర్పాట్లను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు.

Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం

ఈ అంశమై సుదర్శన్ రెడ్డి (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) మాట్లాడుతూ.. ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 139 లొకేషన్లలో డ్రోన్స్‌తో పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. డ్రోన్‌లను ఎగురవేయడానికి సివిల్ ఏవియేషన్, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి అధికారిక అనుమతులు తీసుకున్నామని.. ప్రైవేటు వ్యక్తులు డ్రోన్‌లు ఎగరేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించామని, ఏవైనా సమస్యలుంటే ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.

Kishan Reddy: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం

అలాగే ఆర్వీ కర్ణన్ (జిల్లా ఎన్నికల అధికారి) మాట్లాడుతూ.. మొత్తం 407 సెంటర్లకు ఎన్నికల సామాగ్రిని పంపించామని, ఈ ఎన్నికల విధుల్లో 2,600 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. 2,000 మంది పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 5,000 మంది ఎన్నికలలో పాల్గొనబోతున్నారని వివరించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని.. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా నిఘా ఉంటుందని ఆయన తెలిపారు.

Exit mobile version