Site icon NTV Telugu

Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం.. గెలుపు ఎవరిది..?

Jubilee Hills By Election L

Jubilee Hills By Election L

Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి.. కౌంటింగ్ కోసం మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుంది.. ఒకటో నెంబర్ పోలింగ్ బూత్ షేక్ పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 1,94,631 ఓట్లు పోలయ్యాయి.. 99,771 మంది పుషులు, 94,855 మంది స్త్రీలు ఓటు వేశారు. ఐదుగురు నపుంసకులు ఓటు వేయగా.. మొత్తం 48.49% పోలింగ్ శాతం నమోదైంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఏ పార్టీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేస్తారో తేలాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే..

READ MORE: The Girlfriend: చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ హగ్.. కొత్త కాంట్రవర్సీ తెర మీదకి

Exit mobile version