Site icon NTV Telugu

Jubilee Hills by-election: రేపటిలోపు అభ్యర్థిని ప్రకటిస్తాం.. గెలిపించాలని కోరుతున్న..!

Ramchander Rao

Ramchander Rao

Jubilee Hills by-election: నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు వారి అభ్యర్థుల ఖరారుపై సన్నాహాలు మరింత దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. అనేక మంది విద్యావంతులు, మేధావులు బీజేపీలో చేరుతున్నారని.. రేపటిలోపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందా, లేక మజ్లిస్ పోటీ చేస్తుందా అనేది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నాడు. హస్తం గుర్తుతోనే పతంగిని ఎగరేస్తున్నారు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలను మోసం చేయడమే అని అన్నారు.

Super Hit Pairs: మళ్లీ తెరపై సందడి చేయబోతున్న స్టార్ పెయిర్స్.!

ఇకపోతే, జూబ్లీహిల్స్‌ను ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని.. అక్కడ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదన్నారు. ఇంకా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. అవన్నీ 420 కేసులే అన్నారు. బీజేపీనే గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని ఆయన అన్నారు. నిజమైన ప్రతిపక్షంగా మేమే కాంగ్రెస్‌ను నిలదీస్తాం అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, BRS పార్టీలో గెలిచినవాళ్లు ఆ పార్టీలో ఉంటారో లేదో తెలియదన్నారు. చివరికి వాళ్లు పార్టీ మారక తప్పదని.. పార్లమెంట్ ఎన్నికలలో మరో పార్టీ నుండి B ఫార్మ్ తీసుకుని పోటీ చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Trump: ఇజ్రాయెల్‌కు బయల్దేరేటప్పుడు భారీ వర్షం.. గొడుగుతో ఇబ్బంది పడ్డ ట్రంప్.. వీడియో వైరల్

Exit mobile version