JR NTR : టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. గతంలో లాగా ఏడాదికో సినిమా కాకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం వార్-2 మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం బాగానే కష్టపడుతున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఇంకా పాల్గొనలేదు. వార్-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో నెల రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నారు. తాజాగా ఆయన ఎయిర్ పోర్టు దగ్గర చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఇది చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Read Also : Vijay : విజయ్ మీద కేసు.. ముస్లిం సంఘాల ఆగ్రహం
లైట్ గా గడ్డం పెంచి, స్టైలిష్ హెయిర్ తో పాటు గాగుల్స్ పెట్టుకుని చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నాడు జూనియర్. గతంలో కంటే ఈ లుక్ బాగా అట్రాక్టివ్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఈ లుక్ కచ్చితంగా ప్రశాంత్ నీల్ సినిమా కోసమే కావచ్చు అంటూ కామెంట్లు వస్తున్నాయి. ప్రశాంత్ సినిమాలో హీరోలు ఎంత స్టైలిష్ గా ఉంటారో.. అంతే వైల్డ్ గా కనిపిస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ కూడా ఆ కోవకు చెందిందే అంటున్నారు. మొన్న ఓ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ మీద కొందరు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లుక్ ను పోస్టు చేస్తూ.. ఇంతకంటే బెటర్ లుక్ కావాలా అంటూ పోస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. వార్-2 సినిమాలో హృతిక్ తో కలిసి ఓ పాటలో జూనియర్ డ్యాన్స్ చేయబోతున్నాడు. ఈ సాంగ్ కోసం ముంబైలో వేసిన భారీ సెట్ కు ఎన్టీఆర్ వెళ్తున్నాడు.
Read Also : CPI Narayana: జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు..