Site icon NTV Telugu

JR NTR: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‎తో ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే

Ntr Movie With Sitharamam Hanu Detailss

Ntr Movie With Sitharamam Hanu Detailss

JR NTR: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ కనిపించడం లేదని అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో వారిద్దరి సినిమా క్యాన్సిల్ అయిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవల విడుదలైన పోస్టర్ ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని.. ఇందులో తారక్ మరింత పవర్ ఫుల్ లుక్‏లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Read Also: Naveen Chandra: తగ్గేదే లే.. ఆమె కోసమే 38సార్లు సినిమా చూశా.. ఇంతలా ఆ హీరోకు నచ్చిన నటి ఎవరంటే ?

హను రాఘవపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్ ను వినిపించారు అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్. త్వరలోనే వీరి కాంబో అప్డేట్ అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారట. ఇక ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను.. ఇప్పుడు ఎన్టీఆర్‏తో సినిమా చేస్తుండడంతో అభిమానులలో క్యూరియాసిటిని పెంచేసింది. ఈ వార్త ఇంకా కన్ఫర్మ్ కాలేదు. హను తన సీతా రామం బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఫాంలో ఉన్నాడు. సున్నితమైన ఎమోషన్ ఉన్న సినిమాలు తీసి హను ప్రసిద్ది చెందాడు. ఇలాంటి డైరెక్టర్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్‌ను వివరించడం ఆసక్తికరమైన విషయం.ఇంకా ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతారని టాక్. ఈ వార్తలు ఎంత నిజమో కాలమే నిర్ణయించాలి.

Exit mobile version