Jr Ntr Meets Amit Shah At Novatel: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూసిన అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య అరగంట పైగా సమావేశం జరిగింది.
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమిత్ షా తో కలిసి విందులో పాల్గొనటం రాజకీయంగా ప్రకంపనాలకు కారణమవుతోంది. అటు ఏపీలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ..ఇటు నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పుడు నేరుగా అమిత్ షా భేటీ కావటం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి అమిత్ షా తారక్ తో సమావేశం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీ..ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అమిత్ షాకి తారక్ చెప్పినట్టు తెలుస్తోంది.
భేటీ అనంతరం వివరాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాకు వెల్లడించారు. ‘‘జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభావంతమైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం. ఆర్‌ఆర్‌ఆర్ లో ఆయన నటన బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడటం సంతోషకరం..’’ అని అమిత్ షా పేర్కొన్నట్టు తెలిపారు.
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
— Amit Shah (@AmitShah) August 21, 2022
https://youtube.com/watch?v=KOGdVjgf5qc…
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!