NTV Telugu Site icon

Chandra Mohan Death: చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్‌

Untitled Design (3)

Untitled Design (3)

Celebrities mourn the death of Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్‌ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్‌, సాయి తేజ్‌.. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చంద్రమోహన్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారు అకాల మరణం చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్‌ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.

‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కల్యాణ్‌ రామ్‌ ట్వీట్ చేశారు.

Also Read: Chandra Mohan: చంద్రమోహన్‌ చివరి సినిమా ఇదే!

‘చంద్రమోహన్ మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’ సాయి ధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.

‘ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్ర‌మోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

‘సీనియ‌ర్ న‌టుడు చంద్రమోహ‌న్ మృతి బాధాక‌రం. హీరో, కమెడియ‌న్‌, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నా’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Show comments