NTV Telugu Site icon

Devara: అయ్యో.. మిస్ అయ్యామే! తెగ బాధపడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్

Ntr Fans

Ntr Fans

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పది రోజుల్లోనే 466 కోట్లు రాబట్టి.. 500 కోట్ల చేరువలో ఉంది. దీంతో టైగర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ.. ఇప్పుడు వారే తెగ బాధపడిపోతున్నారు. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ అనే చెప్పాలి.

ప్రస్తుతం తెలుగులో డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తమిళ్‌లో మాత్రం ఇప్పటికీ గ్రాండ్‌గా ఆడియో ఫంక్షన్లు జరుగుతున్నాయి. తమిళ్‌లో ఏ సినిమా రిలీజ్ అయినా సరే.. ఆడియో ఫంక్షన్ ఉండాల్సిందే. గతంలో తెలుగులోను ఇలాంటి ఈవెంట్స్ ఉండేవి కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అన్నీ పోయాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో ఆ లోటును కాస్త భర్తీ చేస్తున్నారు. దేవర సినిమాకు కూడా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ 5 వేలు అనుకుంటే.. 35 వేల మంది ఫాన్స్ వచ్చారు. టైగర్ ఫ్యాన్స్ తాకిడికి ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్‌లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్‌ను ఫాన్స్ ఓ రేంజ్‌లో ఊహించుకున్నారు. తీరా రద్దవడంతో అనిరుధ్ పర్ఫార్మెన్స్ మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు. ఇప్పుడు మరింత ఫీల్ అవుతున్నారు.

Also Red: NBK 109: బాలయ్య ఫాన్స్‌కు ‘దసరా’ డబుల్ ధమాకా!

రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ ఆడియో లాంచ్ జరిగింది. ‘మనసిలాయో’ పాటకు అనిరుధ్ రవిచంద్రన్ అదిరిపోయే లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గతంలో ‘హుకుం’ సాంగ్‌కి ఆడిటోరియం దద్దరిల్లిపోగా.. ఇప్పుడు ‘మనసిలాయో’కి కూడా అదే సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఫెర్ఫార్మెన్స్ వీడియోని రిలీజ్ చేయగా.. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ‘అయ్యో.. ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ మిస్ అయిపోయామే’, ‘అనిరుధ్.. సూపర్ ఫెర్ఫార్మెన్స్’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

 

Show comments