NTV Telugu Site icon

Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..

Ntr

Ntr

మన దేశంలో అతి పెద్ద ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో ఒకటైన గ్రీన్‎ప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్, నూతన సున్నా ఎమిషన్ (ఈ-0) ఉత్పత్తి శ్రేణి కొరకు తన కొత్త బ్రాండ్ ప్రకటన ప్రారంభముతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది..ది టెలివిజన్ కమర్షియల్ (టివిసి)భారతదేశపు అత్యంత విజయవంతమైన బ్రాండ్ ఎంబాసిడర్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ను తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది..

మొట్టమొదటి సున్నా-ఎమిషన్ ప్లైవుడ్ శ్రేణిని గ్రీన్‎ప్లై 2021లో ప్రవేశపెట్టింది, తద్వారా ఉడ్ ప్యానెల్ పరిశ్రమలో కొత్త ఉత్పత్తులకు ప్రమాణాలను ఏర్పరచింది. బ్రాండ్ యొక్క కొత్త టివి వాణిజ్య ప్రకటన, ఆరోగ్యకరమైన ఇంటీరియర్స్ ను పరిరక్షించే ఒక హీరోగా ఎన్టీఆర్ ను నియమిస్తుంది.. ఈ వాణిజ్య ప్రకటన సందడిగా ఉండే ఒక వర్క్ షాప్ తో మొదలౌతుంది, అక్కడ ఇద్దరు వడ్రంగులు సాధారణ ప్లై ఉడ్ తో శ్రద్ధగా శ్రమిస్తూ ఉంటారు. ఆ ప్లై ఉడ్ నుండి వెలువడే హానికరమైన ఉద్గారాలతో వారు పోరాడటములో వారి అసౌకర్యము తేటతెల్లం అవుతుంది. అవి వారి కళ్ళలో దురద, శ్వాస ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది.

ఒక వాస్తవ-యాక్షన్ హీరో శైలిలో, జూ. ఎన్‎టిఆర్ అక్కడికి వస్తారు, నమ్మకంగా తన కటౌట్ వైపు అడుగులు వేస్తారు. అలాగే ఒక గట్టి దెబ్బతో సాధారణ ప్లై ఉడ్ తో తయారు చేయబడిన ఆ చెక్క కటౌట్ ను పడేసి, సాధారణ హానికరమైన ఎమిషన్ ప్లై ఉడ్ పై విజయాన్ని ప్రకటిస్తారు.. ఎన్టీఆర్ నియమించడం తో ఈ బ్రాండ్ నేరుగా జనాలను చేరుతుందని ప్రతి నిధులు చెబుతున్నారు.. గ్రీన్‎ప్లై ఆరోగ్యకరమైన ఇంటీరియర్స్ ను పెంచుట మరియు సున్నా ఎమిషన్ ఉత్పత్తులను ప్రచారం చేయడము అనే తన సందేశాన్ని విస్తరించాలని లక్ష్యంగా కలిగి ఉంది. అద్భుతమైన టివి ప్రచారము అత్యుత్సాహము కలిగించుటకు ఈ ప్రయత్నం అని అధికారులు తెలిపారు.. ఇకపోతే ఈ మధ్య ఎన్టీఆర్ అనేక బ్రాండ్ లకు ఎంబాసిడర్ వ్యవహారిస్తున్నారు.. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..

Show comments