Site icon NTV Telugu

Vizag Honey Trap Case: హనీట్రాప్ కేసు.. పోలీసుల కస్టడీలో నోరుమెదపని కిలాడీ లేడి..!

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case

Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన హనీట్రాప్‌ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు… అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు… అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.. ఫారెస్ట్ అధికారితో కిలాడీ లేడీకి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.. ఇక, హనీట్రాప్ ముఠా సభ్యుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఠా కీలక సభ్యుడు వేముల కిషోర్ ను అరెస్ట్ చేసి.. పోలీసులు కస్టడీ లోకి తీసుకొని క్రాస్ ఎగ్జామింగ్ చేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా సమాచారం..

Read Also: Prabhas : రెండు పాత్రలు.. మూడు గెటప్ లు.. ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్

హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం విదితమే.. తనపై మత్తుమందు చల్లి.. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను తీసిందని పోలీసులకు వరుసగా బాధితులు కంప్లైంట్ చేయడంతో.. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.. అందులో భాగంగా కిలాడీ లేడీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.. యువకులే టార్గెట్ గా చేసుకుని వారితో స్నేహం చేసి.. ఆపై ప్రేమగా నటిస్తూ.. ఆ తర్వాత శారీరకంగా దగ్గరై ఫోటోలు, వీడియోలతో తీసి బ్లాక్ మెయిల్ చేయడం.. డబ్బులు గుంజడమే టార్గెట్‌గా పెట్టుకుంది.. హాట్ హాట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మనసు దోచేసే అందాల కిలాడీ లేడీ జాయ్ జెమీయా.. వారు తమ దారిలోకి వచ్చిన తర్వాత.. బ్లాక్‌ మెయిల్ చేయడం.. అందనకాడికి దండుకోవడం పనిగా మలచుకుంది.. ఆమె చేతిలో మోసపోయిన బాధితుల నుంచి కొన్ని కోట్ల రూపాయల చెల్లింపులను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆమె అకౌంట్స్‌ను ఫ్రీజ్‌ చేశారు. ఆమె బాగోతాలు తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు. హనీ ట్రాప్ గురించి విన్నాం… కానీ, ఇలాంటి స్థాయిలో ఉంటుందా అంటూ నోరువెల్లబట్టాల్సిన పరిస్థితి వచ్చింది..

Exit mobile version