Site icon NTV Telugu

Siddique Kappan : ఫలించిన 28నెలల పోరాటం.. జైలునుంచి విడుదలైన జర్నలిస్ట్

Kappan

Kappan

Siddique Kappan : కేరళకు చెందిన సిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం అరెస్టయ్యాడు. యువతిపై అత్యాచారం, హత్య ఆరోపణలపై నివేదించేందుకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆమె మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. సిద్ధిక్ కప్పన్ పై ఉన్న రెండు కేసుల్లో బెయిల్ వచ్చి నెలరోజులైనా తాను ఇంకా జైలులోనే ఉన్నాడు. ఇవాళ రిలీజ్ చేశారు. ల‌క్నోలోని స్పెష‌ల్ కోర్టు క‌ప్పన్ ను రిలీజ్ చేస్తూ ఆదేశాల‌పై సంత‌కం చేసింది. రాక్షష చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటానని కప్పన్ తెలిపాడు. తనను బెయిల్ వచ్చినా జైల్లో పెట్టారని, రెండేళ్లు క‌ఠినంగా సాగినా, ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేద‌ని ఆయన చెప్పాడు.

Read Also: Rains : తమిళనాడును ముంచెత్తిన వానలు.. స్కూళ్లు బంద్

దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన 20 ఏళ్ల దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య గురించి నివేదించడానికి ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వెళుతుండగా అక్టోబర్ 2020లో అరెస్టయ్యాడు. అశాంతి సృష్టించడానికే అక్కడికి వెళ్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన 15 రోజుల తర్వాత ఆ మహిళ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించింది. ఆమెను జిల్లా యంత్రాంగం తన గ్రామంలో అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నటలు విస్తృతంగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న చెల‌రేగింది. అత‌నిపై దేశ‌ద్రోహం కేసు బుక్ చేశారు. 2022 ఫిబ్రవ‌రిలో అత‌నిపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు కూడా న‌మోదు చేశారు. నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నుంచి డ‌బ్బులు తీసుకున్నట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

Read Also: Security Guard : ఓనర్‎ను కత్తితో పొడిచిన సెక్యూరిటీ.. అలా చేశాడన్న కోపంతో దారుణం

టెర్రర్ కేసులో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో అత‌నికి బెయిల్ వ‌చ్చింది. ఇక డిసెంబ‌ర్‌లో అత‌నిపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు బుక్కైంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల అత‌ని రిలీజ్‌ను నిలిపివేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌తో త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని క‌ప్పన్ తెలిపాడు. కేవ‌లం జ‌ర్నలిస్టుగా వార్తల‌ను క‌వ‌ర్ చేసేందుకు హ‌త్రాస్‌కు వెళ్లిన‌ట్లు అత‌ను చెప్పాడు.

Exit mobile version