Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Journalist Daughter Of Vladimir Putins Mentor Flees Russia Amid Probes

Daughter of Putin Mentor: రష్యాను వీడిన పుతిన్‌ గురువు కుమార్తె.. ఎందుకంటే?

Published Date :October 28, 2022 , 9:16 am
By Mahesh Jakki
Daughter of Putin Mentor: రష్యాను వీడిన పుతిన్‌ గురువు కుమార్తె.. ఎందుకంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Daughter of Putin Mentor: ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోన్న రష్యా తమ దేశంలో నిర్బంధ సైనిక సమీకరణ అమలు చేస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుని యుద్ధానికి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది పౌరులు దేశాన్ని వీడుతున్నారు. పుతిన్‌ లక్ష్యంగా చేసుకుంటారనే భయంతో చాలా మంది క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనకారులు దేశం విడిచి వెళ్లారు. ఇదిలా ఉంటే.. వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజకీయ గురువైన అనటోలి సొబ్‌చాక్‌ కుమార్తె, ప్రముఖ జర్నలిస్ట్ అయిన సెనియా సొబ్‌చాక్‌(40) రష్యాను వీడారు. ఓ కేసుకు సంబంధించి ఆమె సహోద్యోగిని నిర్బంధించిన పోలీసులు సెనియా సొబ్‌చాక్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించగా.. ఈ తరుణంలో ఆమె రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.

Tamilnadu: తమిళనాడులో సంచలనం.. క్షుద్ర పూజల కోసం బాలిక తలను తీసుకెళ్లిన మాంత్రికుడు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సెనియా.. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను పలుమార్లు బహిరంగంగానే ప్రశ్నించారు. 2012 ఎన్నికలకు ముందు క్రెమ్లిన్‌ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న సెనియా.. 2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేసి 2 శాతం ఓట్లు సాధించారు. ఆ తర్వాత విపక్ష నేతలతో పుతిన్‌ నిర్వహించిన సమావేశంలో కూడా పాల్గొన్నారు. సెనియా పనిచేస్తోన్న మీడియా సంస్థ డైరెక్టర్‌ను పోలీసులు ఓ కేసులో ఇటీవల నిర్బంధించారు. అనంతరం సెనియా నివాసంపైనా పోలీసులు సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా ఆమెను అరెస్టు చేసేందుకు వారెంట్‌ కూడా పోలీసులు వద్ద ఉన్నట్లు రష్యా మీడియా ఏజెన్సీ వెల్లడించింది. దీంతో ఆమె అరెస్ట్ ఖాయమన్న వార్తలు వచ్చాయి. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన సెనియా తమ మీడియా సంస్థపై కక్షతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా, రష్యాను వీడి లిథువేనియాకు వెళ్లిపోయారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Daughter of Putin Mentor
  • Ksenia Sobchak
  • Russia
  • Russia-Ukraine War
  • Ukraine

తాజావార్తలు

  • Tollywood : నాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరో

  • CM Revanth Reddy : మెట్రో ఇకపై ప్రభుత్వ సొత్తు.. ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం..!

  • Pawan kalyan: కాంగ్రెస్ బాధ్యతగా రాష్ట్రాన్ని విడగొట్టలేదు.. అసెంబ్లీలో పవన్‌కల్యాణ్ విమర్శలు

  • Pakistan Cricket: పాక్‌ క్రికెట్‌కు ఘోర అవమానం.. ప్లేయర్లతో పాటు షాక్ ఇస్తున్న కామెంటేటర్లు..

  • PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions