Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. మరోసారి తన బ్యాటింగ్ సత్తా చాటిన బట్లర్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును కూడా అధిగమించాడు.
టీ20ల్లో రోహిత్ శర్మను దాటిన బట్లర్
శ్రీలంకపై 80 పరుగుల ఇన్నింగ్స్‌తో జోస్ బట్లర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.. బట్లర్ ఖాతాలో ఇప్పుడు 4,292 టీ20 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. రోహిత్ శర్మ 4,231 పరుగులతో మూడో స్థానానికి వెళ్లాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 4,596 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకపై ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఆ జట్టు ఆరంభంలోనే ఒక వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడు పెంచారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన శతకంతో చెలరేగాడు. బ్రూక్ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 114 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో బౌండరీలతో పాటు భారీ షాట్లు కూడా ఉన్నాయి. మరోవైపు బట్లర్ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ స్కోర్ భారీగా పెరిగింది.
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
60 బంతుల్లో 128 పరుగుల భాగస్వామ్యం
బట్లర్, హ్యారీ బ్రూక్ కలిసి శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కేవలం 60 బంతుల్లోనే 128 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బట్లర్ 80 పరుగులు చేయగా, బ్రూక్ 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక, 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యాన్ని ఛేదించే పరిస్థితి లేకుండా పోయింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. చివరికి శ్రీలంక 135 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారీ స్కోర్ సాధించిన ఇంగ్లండ్‌కు బట్లర్, బ్రూక్ బ్యాటింగ్ ప్రధాన బలంగా నిలిచింది. ఈ విజయంతో తొలి టీ20లో ఇంగ్లండ్ ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన శ్రీలంక బ్యాటింగ్‌పై నిరాశ వ్యక్తమైంది. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జోస్ బట్లర్‌పై ప్రశంసలు కురిపించాడు. బట్లర్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ అద్భుతమైన అనుభవమేనని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!