Jolin Tsai: తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్ ‘ప్లెజర్ వరల్డ్ టూర్’తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టేజ్‌పై ఆమె ఇచ్చిన ఓ వినూత్నమైన, సాహసోపేతమైన ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 30 మీటర్ల పొడవైన అనకొండ ఆకారంలో ఉన్న భారీ స్టేజ్ నిర్మాణం తలపై నిలబడి ఆమె డ్యాన్స్ చేస్తూ పాటలు పాడిన వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ONGC Gas Leak: లీకైన ONGC గ్యాస్ పైప్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు, భయాందోళనలో ప్రజలు..!
ఈ ప్రదర్శన డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు తైపేలో జరిగిన ‘ప్లెజర్ వరల్డ్ టూర్’ ప్రారంభ షోలలో భాగంగా జరిగింది. మూడు రోజుల పాటు సాగిన ఈ మెగా షోలకు ప్రతిరోజూ సుమారు 40 వేల మంది హాజరుకాగా.. మొత్తం 1.20 లక్షలకు పైగా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో జోలిన్ సాయ్ ఒక భారీ అనకొండ తలపై నిలబడి డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది.
ఈ వీడియోను మొదట చూస్తే.. నిజమైన పామే అనిపించినా, అది పూర్తిగా స్టేజ్ కోసం రూపొందించిన రియలిస్టిక్ స్ట్రక్చర్ మాత్రమే. ఈ 30 మీటర్ల పొడవైన అనకొండ ఆకారపు స్టేజ్‌ను క్రూ మెంబర్లు లైవ్‌లో ఆపరేట్ చేయడం విశేషం. కదులుతున్న పాము మీద ధైర్యంగా ఆమె చేసిన ప్రదర్శనను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఆసియాలోనే అత్యంత క్రియేటివ్, బోల్డ్ లైవ్ పెర్ఫార్మర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జోలిన్ సాయ్, ఈ షోతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అనకొండతో పాటు ఎద్దు, సీతాకోకచిలుక, పంది ఆకారాల్లో రూపొందించిన భారీ కదిలే స్టేజ్ నిర్మాణాలు ఈ టూర్‌కు ఫాంటసీ ప్రపంచంలాంటి వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి. తైవానీస్ మీడియా కథనాల ప్రకారం.. ఈ వరల్డ్ టూర్ ప్రొడక్షన్ కోసం జోలిన్ సాయ్ దాదాపు 900 మిలియన్ తైవానీస్ డాలర్లు, అంటే సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఆసియా పాప్ టూర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ అనకొండ డ్యాన్స్ వీడియోపై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ‘ఇది నిజమైన పామేనా?’, ‘ఇంత పెద్ద అనకొండ ఎలా ఉంటుంది?’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
