NTV Telugu Site icon

Hyderabad : జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Illicit Relationship

Illicit Relationship

జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితో ఉండగా.. భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది.. గత కొద్ది రోజులుగా వారాసిగూడలో ఆ అమ్మాయితో జానకిరామ్ ఉంటున్నాడు.. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది. ఇరద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాడని కళ్యాణి ఆరోపించింది. గొడవ జరుగుతున్న ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

READ MORE: Hyderabad: అలర్ట్.. అంబర్‌పేట్‌లో నలుగురు విద్యార్థులు అదృశ్యం…

జానకీరామ్ మెదక్‌లో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశాడు. ఇప్పుడు ప్రస్తుతం హెడ్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాడు. 4 నెలల క్రితం వారాసిగూడా వచ్చాడు. ఈరోజు ఉదయం మరో మహిళతో ఉన్నట్లు కుటుంబీకులకు తెలిసింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కుటుంబీకులు జానకీరామ్‌ను చితకబాదారు. వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గాయాలపాలైన జానకీరామ్‌ను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే… వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇప్పటికే పెళ్లి అయినట్లు తెలుస్తోంది.  స్టేషన్‌కి తరలించిన పోలీసులు.. భార్య, భర్త, మరో మహిళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలని.. బహిరంగంగా గొడవ పడి శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని పోలీసులు తెలిపారు.

READ MORE: Zelensky-Elon Musk: పిల్లలు చచ్చిపోతుంటే ఫొటోషూట్‌లా.. జెలెన్ స్కీ‌పై మస్క్ ఫైర్