Site icon NTV Telugu

John Cena: రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఓడిపోయిన జాన్‌సీనా.. ఓడించింది ఇతనే!

John Cena

John Cena

John Cena: ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు జాన్‌సీనా. WWE తో ఈ ఛాంపియన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 48 ఏళ్ల జాన్‌సీనాకు శనివారంతో WWE ప్రయాణం ముగిసింది. తన చివరి మ్యాచ్‌లో ఈ స్టార్ గుంథర్ చేతిలో ఓడిపోయి, తన 23 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ సమయంలో ఈ జాన్‌సీనా చాలా నిరుత్సాహంగా కనిపించాడు. అయితే మొదట జాన్‌సీనా తన చివరి మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. దీంతో ఈ స్టార్ విజయనాధంతో తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని అనిపించింది. కానీ మ్యాచ్ సాగుతున్న కొద్దీ, ఆయన ఓటమికి చేరువ అయ్యాడు.

READ ALSO: Kerala: లెఫ్ట్ కూటమి ఓడిపాయె.. ‘‘మీసాలు’’ పోయె..

కానీ ఈ స్టార్ చివరి వరకు పోరాడి గుంథర్ చేతిలో ఓడిపోయాడు. ఇక ఆయన ప్రొఫెనషనల్ కెరీర్ విషయానికి వస్తే ఆయన 2002లో కర్ట్ యాంగిల్‌తో జరిగిన స్మాక్‌డౌన్ ఎపిసోడ్‌లో WWE అరంగేట్రం చేశాడు. జాన్‌సీనా తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 2004లో ఈ స్టార్ రెజిల్‌మేనియాలో అరంగేట్రం చేసి బిగ్ షోను ఓడించి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టైటిల్‌ను ముద్దాడిన తర్వాత జాన్‌సీనా ఇంక తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. తరువాతి రెండు దశాబ్దాల పాటు WWE రింగ్‌లో ఒక గొప్ప స్థాయికి చేరుకున్నాడు.

ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో జాన్‌సీనా 17 సార్లు ప్రపంచ ఛాంపియన్. అలాగే ఆయన మూడుసార్లు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్, రికార్డు స్థాయిలో పదమూడు సార్లు WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ కూడా. ఈ ఛాంపియన్‌షిప్‌లతో పాటు, జాన్‌సీనా నాలుగు సార్లు WWE యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ను, ఐదుసార్లు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ను ముద్దాడాడు. ఆయన WWEలో మొత్తం 2,259 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఈ స్టార్ ప్రయాణం WWE లో ముగిసింది.

READ ALSO: Bondi Beach Shooting: ఆస్ట్రేలియాను వణికించిన కాల్పులు.. ఉగ్రదాడిలో 10 మంది మృతి.. వైరల్‌గా మారిన వీడియో

Exit mobile version