Vedaa : జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్, జేఏ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన చిత్రం ‘వేద’. ఈ సినిమాలో జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ నటించారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 10న ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ‘వేద’ సమాజంలోని దళిత, కుల వివక్షల మీద ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ దసరా సందర్భంగా అక్టోబర్ 10 నుంచి జీ5లో ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ స్ట్రీమింగ్ అవుతోంది. వేద సంవిధాన్ క రక్షక్ హిందీ, తమిళం, తెలుగులో అక్టోబర్ 10 నుండి జీ5లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలో జీ5 ఇండియాలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ.. ‘జీ5లో వేద చిత్రం వచ్చేసింది. సామాజిక అసమానతలు, కుల వివక్ష మీద చేసే పోరాటంగా వేద చిత్రాన్ని తెరకెక్కించారు. జీ5లో ఈ చిత్రం వస్తుండటం మాకు గర్వంగా ఉంది. సామాజిక సందేశాన్నిస్తూ, అర్థవంతమైన సంభాషణలతో వచ్చిన ‘వేద’తో మా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘వేద ఇప్పుడు జీ5లోకి వచ్చింది. ఈ శక్తిమంతమైన కథనం మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరుకుంటున్నందుకు సంతోషిస్తున్నాము. ఇది ప్రభావవంతమైన కథనానికి మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఆర్టిస్టుల పర్ఫామెన్స్, సోషల్ మెసెజ్ మరింతగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయ’ అని అన్నారు. ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత మధు భోజ్వానీ మాట్లాడుతూ.. ‘ ‘వేద’ను దాని డిజిటల్ ప్రీమియర్‌తో మరింత ఎక్కువ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. ఓ స్ఫూర్తినిచ్చే, శక్తినిచ్చే కథను చెప్పాలని ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. డిజిటల్ విడుదల ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.
దర్శకుడు నిఖిల్ అద్వానీ మాట్లాడుతూ.. ‘అర్థవంతమైన సంభాషణలతో, మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించాలనే వేదను తీశాం. వేద వినోదాత్మకంగా మాత్రమే కాకుండా ఆలోచనలు రేకెత్తించేలా ఉంటుంది. జీ5లో సినిమా విడుదల చేయడం ద్వారా ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యామ’ని అన్నారు. హీరో జాన్ అబ్రహం మాట్లాడుతూ, “వేద లాంటి సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. వేద స్త్రీ శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ చిత్రం నేటి కాలంలో చాలా ముఖ్యమైనది, పైగాసందర్భోచితమైనది. ఇది మహిళలు అభివృద్ధి చెందినప్పుడే.. సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పే చిత్రం. జీ5 ప్రేక్షకులు వేదలో ఈ పరివర్తన సందేశాన్ని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటుడు శర్వరి మాట్లాడుతూ..‘జీ5లో ‘వేద’ డిజిటల్ విడుదలైంది. వేదలో నటించడం మరిచిపోలేని అనుభవం. వేదపై ఇంత ప్రేమ, ప్రశంసలు లభించడం చాలా గొప్ప విషయం, వేద స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ప్రేక్షకులు అక్టోబర్ 10 నుండి జీ5లో ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ని చూడొచ్చు.
జీ5 గురించి…
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్ గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
https://zee5.onelink.me/RlQq/453vzt97