Ration Dealers: రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ఇలా..
- రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్..
- జోగులాండ గద్వాల జిల్లాలో ఖాళీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగులకు , అర్హులైన అభ్యర్థులకు పౌర సరఫరాల శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలను రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శ్రీనివాసరావు బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఖాళీలు ఉన్న గ్రామాల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 మండలాల్లోని 14 గ్రామాల్లో ఎఫ్.పి.ఎస్ (FPS) డీలర్ల భర్తీ చేపట్టనున్నారు. అలంపూర్ మండలంలో అలంపూర్, క్యాతూర్.. ఉండవెల్లి మండలంలో బోన్కూర్, మానోపాడు మండలంలో.. చండూరు, నారాయణపూర్. అయిజ మండలంలో జడదొడ్డి, కూడకనూరు, అయిజ.. రాజోలి మండలంలో పడమటిగార్లపాడు, పచ్చర్ల.. వడ్డేపల్లి మండలంలో పైపాడు.. ఎర్రవల్లి మండలంలో వల్లూరు, రాజశ్రీ గార్లపాడు.. ఇటిక్యాల మండలంలో మొగిలిరావలచెరువు గ్రామల్లో ఈ రేషన్ డీలర్ల ఖాళీలు ఉన్నాయి.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నివాసితులై ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండటంతో పాటు, రిజర్వేషన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం నిర్దేశించిన రోస్టర్ పద్ధతిని అనుసరిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ..
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రతి గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ వివరాలు, అవసరమైన ధ్రువపత్రాల జాబితా , దరఖాస్తు ఫారాలు తహసీల్దార్ కార్యాలయ నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటాయి.
పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15, 2026 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని ఆర్డీఓ స్పష్టం చేశారు. స్థానిక యువత, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. త్వరలోనే కొత్త డీలర్లను నియమించడం ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీని మరింత సులభతరం చేయడమే ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశం.
తాజావార్తలు
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!