Jogi Ramesh: తనపై జరుగుతున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్, తప్పుడు ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు నకిలీ మద్యంతో సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు తాను నార్కో అనాలసిస్ టెస్టుకు, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని ప్రకటించారు.
Kurnool Bus Incident: కర్నూలు బస్సు ప్రమాదంపై బాపట్ల ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కారణం అదే..!
ఫేక్ కాల్స్‌తో తన వ్యక్తిత్వ సహననానికి పాల్పడుతున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. దమ్ముంటే తనను ధైర్యంగా ఎదురుగా ఎదుర్కోవాలని, ఐవీఆర్‌ఎస్ కాల్స్ పేరుతో ఫేక్ కాల్స్ చేయించడం ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడి నుండి చేస్తున్నారో కూడా తెలియకుండా ఈ నకిలీ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమ చేతిలో ఉందని ఏదైనా చేయొచ్చని భావిస్తున్నారేమోనని.. దమ్ము, ధైర్యం ఉంటే ఈ కాల్స్ ఎవరు చేశారో.? ఎవరు చేయిస్తున్నారో.? చెప్పాలని ఆయన సవాలు విసిరారు.
Moonlighting: రెండు ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఏకంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్..!
ఈ విషయంపై విచారణ జరపాలని కోరుతూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానని జోగి రమేష్ వెల్లడించారు. చట్టాన్ని, టెలికం వ్యవస్థను దుర్వినియోగం చేయడంపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కాల్స్ వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తనపై బురద జల్లిందని, తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా నకిలీ మద్యం కేసును అంటగడుతున్నారని ఆరోపించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ నేతలు తనపైనా, తన పార్టీపైనా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని ఏ సంస్థతో విచారణ జరిపినా తాను సిద్ధంగా ఉన్నానని జోగి రమేష్ స్పష్టం చేశారు.
