Jogi Ramesh : ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గెలిచే వారికే పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలి అని కోరుకుంటున్నారన్నారు. నేను కూడా పెడనలోనే ఉండాలని అనుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల బట్టి జగన్ నేను పెడన నుంచి పోటీ చేయాలా వేరే చోటు నుంచి చేయాలా నిర్ణయం తీసుకుంటారని జోగి రమేష్ అన్నారు. ప్రజల్లో ఆదరణ లేకుంటే పార్టీ మార్పులపై నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ఎమ్మెల్యే వద్దని కొందరు, ఎమ్మెల్యే కావాలని కొందరు అడగటం ప్రతి పార్టీలో ఉంటుందన్నారు.
లీడర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. లీడర్ నిర్ణయానికి అందరం కట్టుబడాల్సిందేనని, సీటు – పోటీ విషయంలో పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం అని ఆయన వెల్లడించారు. సంత విషయంపై మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. నాకు పార్టీలో ఎవరితో శతృత్వం లేదు, అందరూ మిత్రులేనని ఆయన అన్నారు. నేను శత్రువని ఎవరైనా అనుకుంటే వాళ్ళే తప్పు చేసినట్టు లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు. నేను ఏ తప్పూ చేయలేదని, నేను ఈ పార్టీలో ఉండి పక్క చూపులు చూడలేదన్నారు. నేను వైసీపీ జెండా మోసాను, ఏ తప్పటడుగు వేయలేదన్నారు.
Also Read
- Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
- Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
- Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
-
Vaibhav Vs Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. ‘ఎంత పని చేశావ్ వైభవ్ సూర్యవంశీ’..
-
Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
-
Iran Military Power: అమెరికానే వణికించేలా ఇరాన్ మిలిటరీ పవర్.. 2,100 క్షిపణులు, వేలాది డ్రోన్లతో యుద్ధానికి సై!
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!