NTV Telugu Site icon

Jofra Archer: రూ.12.5 కోట్లు పెట్టి కొంటే.. చెత్త రికార్డు సృష్టించాడు…

Jofra Archer

Jofra Archer

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆ జట్టు మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. మరోసారి తన రికార్డును తీనే బద్దలు గొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి

కాగా.. ఈ మ్యాచ్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. రూ.12.5 కోట్లు పెట్టి రాజస్థాన్ ఎంతో నమ్మకంతో తెచ్చుకున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వరస్ట్ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఆర్చర్.. ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెల్‌గా ఇది నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక స్పెల్‌లో ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్‌ కిషన్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా అతడి ఓవర్‌లో చుక్కలు చూపించారు. ఆర్చర్ వేసిన ఒక ఓవర్‌లో హెడ్ అయితే ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం జోఫ్రా ఆర్చర్ పై రాజస్థా్న్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు.

READ MORE: SRH vs RR: సొంత గడ్డపై సన్‌రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్‌ చరిత్రలో మరో రికార్డు..