Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jofra Archer: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఆగస్టు 1న లండన్ స్పిరిట్, సదరన్ బ్రేవ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టు 5 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్‌ను ఓడించింది. సదరన్ బ్రేవ్ విజయంలో స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ భీకర బౌలింగ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆర్చర్ తన ‘ది హండ్రెడ్’ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో లండన్ స్పిరిట్ బ్యాటింగ్ లైన్అప్ను దెబ్బతీశాడు. ఆర్చర్ ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 103 పరుగులతో ఉన్న ఆ జట్టు, ఆ తర్వాత కేవలం 2 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 5 వికెట్లను కోల్పోయి 105 పరుగులకే ఆలౌట్ అయింది. పడిపోయిన చివరి 5 వికెట్లలో 3 వికెట్లను ఆర్చర్ ఒక్కడే పడగొట్టడం విశేషం.
20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు:
ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన 20 బంతుల్లో 11 బంతులు డాట్ బాల్స్ కాగా, కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఇది అతనికి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. ఆర్చర్ దాటికి లండన్ స్పిరిట్ జట్టు 100 బంతుల ఆటలో కేవలం 92 బంతులకే కుప్పకూలింది. ఆ జట్టు చేసిన 105 పరుగులలో జానీ బెయిర్‌స్టో ఒక్కడే 56 పరుగులు చేశాడు. అతడిని కూడా ఆర్చరే అవుట్ చేశాడు. ఇక, 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సదరన్ బ్రేవ్ జట్టు 97 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సదరన్ బ్రేవ్ తరఫున ఓపెనర్ జేమీ స్మిత్ 36 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజేతగా నిలిపారు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించిన జోఫ్రా ఆర్చర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంత డేజంర్గా ఉన్నావేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
- India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
- Gangavaram Beach: ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం.. స్నేహితురాలిని కాపాడబోయి యువకుడు గల్లంతు!
- Bhuvneshwar Kumar: "అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!" రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
తాజావార్తలు
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
-
Gangavaram Beach: ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం.. స్నేహితురాలిని కాపాడబోయి యువకుడు గల్లంతు!
-
Mahesh Babu Birthday: మహేష్ బాబు బర్త్‌డేకు ఐకానిక్ బ్లాక్‌బస్టర్ రీరిలీజ్.. మళ్లీ సందడి చేయబోతున్న ‘దూకుడు’
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!