NTV Telugu Site icon

Joe Root: సచిన్ రికార్డులను అధిగమిస్తారా?.. జో రూట్‌ సమాధానం ఇదే!

Joe Root Test Centuries

Joe Root Test Centuries

Most Centuries in Test Cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన రూట్.. 34 సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శతకాల సంఖ్యలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (33)ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 10వ స్థానంలో ఉన్న రూట్.. మరో శతకం చేస్తే ఆరో ర్యాంక్‌కు చేరతాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డుల దిశగా సాగుతున్నాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ రికార్డులను అధిగమిస్తావా? అనే ప్రశ్నకు జో రూట్‌ సమాధానం ఇచ్చాడు. ‘నా ఆటను ఆడేందుకే ప్రయత్నిస్తున్నా. ఇంగ్లండ్ జట్టు కోసం ఎప్పుడూ పరుగులు చేయాలని చూస్తాను. స్కోరు బోర్డుపై ఎక్కువ రన్స్‌ ఉంచితే మా బౌలర్లపై ఒత్తిడి ఉండదు. సెంచరీ చేసినప్పుడు సంతోషంగా ఉండదని చెప్పడం అబద్ధమే. వ్యక్తిగతంగా సంతోషమే కానీ జట్టు విజయం సాధిస్తే మరింత సంతోషంగా ఉంటుంది. నా ఆట జట్టు గెలుపుపై ప్రభావం చూపాలి. అంతేకాని రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. ఫామ్‌ను కొనసాగించడంపైనే నా దృష్టి ఉంటుంది’ అని రూట్‌ చెప్పాడు.

Also Read: Payal Rajput: పాయల్ పరువాల విందు.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే!

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు (51), అత్యధిక పరుగుల రికార్డు (15,921) సచిన్‌ పేరిటే ఉంది. క్రికెట్ దిగ్గజంను అధిగమించాలంటే రూట్‌ ఇంకా 18 శతకాలు, 3544 పరుగులు చేయాలి. రూట్‌ 2021 నుంచి 48 టెస్టులు ఆడిన రూట్.. 4,554 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ప్రస్తుతం రూట్‌ వయసు 33 ఏళ్లు. కనీసం మరో ఐదేళ్లు ఆడతాడు.

Show comments