World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ , పాకిస్తాన్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి బలమైన స్థితికి చేరుకుంది. అంతకుముందు పాకిస్తాన్‌ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, ప్రస్తుతం 195 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జట్టు చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండటంతో ఆధిక్యం మరింత పెరిగే అవకాశం ఉంది. జార్డన్ కాక్స్ తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, 112 బంతుల్లో 10 ఫోర్లతో 66 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో జో రూట్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. WTC లో కెప్టెన్‌గా 3000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టిన రూట్, WTC లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లలో 63 ఇన్నింగ్స్‌లు ఆడి 50.4 సగటుతో మొత్తం 3024 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ 40 మ్యాచ్‌ల్లో 2182 పరుగులు చేయగా, రూట్ అతనికంటే చాలా ముందంజలో ఉన్నాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మరొకవైపు, WTC లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలను వెనక్కి నెట్టి ఐదవ స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజమ్ 20 మ్యాచ్‌ల్లో 56.41 సగటుతో 1918 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 1349 పరుగులతో ఆరవ స్థానంలో, రోహిత్ శర్మ 1254 పరుగులతో ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ , రోహిత్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
WTC లో కెప్టెన్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్లలో జో రూట్ (3024) అగ్రస్థానంలో ఉండగా, బెన్ స్టోక్స్ (2182) రెండవ స్థానంలో, దిముత్ (2160) మూడవ స్థానంలో, క్రెగ్ బ్రాత్‌వైట్ (1994) నాలుగవ స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (1918), విరాట్ కోహ్లీ (1349), టామ్ లేథమ్ (1338), రోహిత్ శర్మ (1254) వరుసగా తదుపరి స్థానాల్లో నిలవగా, ధనంజయ డి సిల్వా (1099), నజ్ముల్ హుస్సేన్ శాంటో (1099) చివరి స్థానాల్లో ఉన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!