Site icon NTV Telugu

Joe Root: టెస్టుల్లో జో రూట్‌ చరిత్ర.. రాహుల్ ద్రవిడ్‌ రికార్డు బ్రేక్‌!

Joe Root Record

Joe Root Record

Most Test Hundreds List: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. లార్డ్స్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేయడంతో రూట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ద్రవిడ్‌ సహా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉంది.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ అగ్ర స్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ టెస్టుల్లో 51 శతకాలు బాదాడు. జాక్వెస్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార్ సంగక్కర (38)లు జో రూట్ కంటే ముందున్నారు. రూట్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. ఆండర్సన్-టెండూల్కర్‌ ట్రోఫీలో సంగక్కరను కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రూట్‌ టాప్‌లో ఉన్నాడు.

Also Read: Crime News: రాడ్లు, కత్తులతో దాడి.. వైసీపీ నేత దారుణ హత్య!

అత్య‌ధిక టెస్టు సెంచ‌రీలు చేసిన బ్యాటర్‌క లిస్ట్:
# సచిన్ టెండూల్కర్ – 51
# జాక్వెస్ కల్లిస్ – 45
# రికీ పాంటింగ్ – 41
# కుమార్ సంగక్కర – 38
# జో రూట్ – 37
# రాహుల్ ద్రవిడ్ – 36
# స్టీవ్ సిత్ – 36

Exit mobile version