NTV Telugu Site icon

Viral Video: జో బైడెన్‌ భార్య, కమలా హారిస్ భర్త.. చట్టసభలోనే ఇలా.. వీడియో వైరల్‌

Joe Biden

Joe Biden

Viral Video: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ఈ వీడియో ఆసక్తికర చర్చకు దారి తీసింది. వారిద్దరు చట్టసభలోనే పబ్లిక్‌గా చుంబించుకోవడంపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. అది మామూలు పలకరింపు అయితే ఫర్వాలేదు. ఏకంగా పెదాలపై చుంబనం కావడంతోనే ఇక్కడ యవ్వారం మరో మలుపు తిరిగింది. మంగళవారం కాపిటోల్‌ హిల్‌లో ప్రెసిడెంట్‌ బైడెన్‌ స్టేట్‌ ఆఫ్‌ ది యూనియర్‌ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. కమలా హారిస్‌ను మరోసారి ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్‌ భావిస్తున్నట్లు లాస్‌ ఏంజెల్స్ టైమ్స్‌ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆంతరంగికుల నుంచి బైడెన్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

Threat to RSS Chief: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు మావోయిస్టుల నుంచి బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌

మరోవైపు ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్థానాలను భారీగా కోల్పోయింది రిపబ్లికన్లు చాలావరకు స్థానాలు దక్కించుకోవడంతో.. బైడెన్‌ ప్రసంగంలో స్నేహపూర్వక వ్యాఖ్యలే ఎక్కువగా వినిపించాయి. కొత్తగా ఎన్నికైన హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీకి శుభాకాంక్షలు తెలుపుతూ బిడెన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ద్వైపాక్షికత ప్రారంభ సంకేతాలను చూపాడు. హౌస్‌లోని మొదటి బ్లాక్ పార్టీ నాయకుడు, మైనారిటీ నాయకుడైన హకీమ్ జెఫ్రీస్‌ను కూడా అధ్యక్షుడు అంగీకరించారు.