NTV Telugu Site icon

Joe Biden : విమానం ఎక్కబోయి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు

Jo Biden

Jo Biden

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి విమానం ఎక్కబోయి మెట్లపై నుంచి జారిపడిపోబోయారు. ఉక్రెయిన్‌, పోలాండ్‌ పర్యటన ముగించుకుని బైడెన్‌ అమెరికాకు తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఎక్కే సమయంలో కాలు జారి పడిపోబోయారు. వెంటనే తన చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. తక్షణమే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Show comments