Site icon NTV Telugu

Andhrapradesh: గుడ్‌ న్యూస్.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు

Jobs

Jobs

Andhrapradesh: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ డా. బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను https://employment.ap.gov.in/ వెబ్ సైట్‌లో మార్చి 1 నుంచి 24 వరకు అర్హులైన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 6 మే, 2024న రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు, పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ సంబంధిత వెబ్ సైట్‌లో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు.

Read Also: MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

• ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులు

• మార్చి 1 నుండి 24 వరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ

• 6 మే, 2024న రాత పరీక్ష

• మరిన్ని వివరాలకు https://employment.ap.gov.in/ వెబ్ పైట్ సందర్శించండి.

Exit mobile version