NTV Telugu Site icon

Jobs Fraud: ఉద్యోగాల పేరుతో వల.. లక్షల్లో మోసం చేసిన కేటుగాడు

Jobs 1

Jobs 1

ఉద్యోగం.. నిరుద్యోగులకు వరం లాంటిది. ఆర్థిక ఇబ్బందులతో, ఇంట్లో తల్లిదండ్రుల పోరు భరించలేక ఎక్కడో చోట ఉద్యోగం చేయాలని భావిస్తారు నిరుద్యోగులు… ఎక్కడైనా ఉద్యోగం ఉందని ప్రకటన వస్తే దానిని చూసి అప్లై చేస్తారు.. లక్షల్లో జీతం అని మాయచేసి బిచాణా ఎత్తేసే కేటుగాళ్ళు ఉంటారు. విశాఖలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న తులసి రామ్ అనే వ్యక్తి వారిని నిలువునా ముంచేశాడు.

Read Also: 65 Weds 16 : నీకు సుడి ఉంది తాత..ఈ వయస్సులో 16ఏళ్ల పిల్లతో మూడోసారా !

ఇన్కమ్ టాక్స్ ఉద్యోగాలు, జిఎస్టి, హెచ్ పీ సీఎల్, కస్టమ్స్ డిపార్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ. లక్షల్లో మోసం చేశాడు. నిరుద్యోగ యువతే తులసి రామ్ టార్గెట్. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల ఫేక్ జాయినింగ్ లెటర్స్, నకిలీ సంతకాలు పెట్టి యువతకి మాయలో దింపి లక్షల వసూలు చేస్తున్నాడు ఆ కేటుగాడు.

నిందితుడు తులసిరాంపై పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితులు కంచరపాలెం పోలీస్, ఫోర్త్ టౌన్, గోపాల్ పట్నం పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. లక్షల్లో మోసం చేసిన తులసిరామ్ పరారీలో ఉన్నాడు. యువత ఇలాంటి మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నిరుద్యోగులకు సూచిస్తున్నారు. డబ్బులు కట్టించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నకిలీ జాబ్ లెటర్లతో మోసానికి గురికావద్దంటున్నారు.

Read Also: Shriya saran: మరీ ఇంత అందమా! శ్రియ సోయగాలకు రెప్ప వాల్చడం కష్టమే..

Show comments