Site icon NTV Telugu

Jobs Fraud in Cambodia : కాంబోడియాలో ఉద్యోగాలంటూ ఎర.. తిరుపతివాసికి నరకయాతన

Jobs Fraud

Jobs Fraud

విదేశాల్లో ఉద్యోగాలు.. మంచి జీతం, సౌకర్యాలు.. ఇంకేముంది అక్కడికెళ్ళి తమ కలలను నిజం చేసుకోవాలని యువత భావిస్తుంది. అయితే ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు దళారులు. కాంబోడియా దేశంలో డేటా ఎంట్రీ ఉద్యోగాలంటూ దగాకు పాల్పడ్డారు. వేలల్లో జీతాలకు ఆశపడి అక్కడికెళ్లిన నిరుద్యోగ యువకులకు నరకం కనిపించింది. సోషల్ మీడియాలో అబ్బాయిలను మోసం చేసే ఉద్యోగాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఉద్యోగం చేయబోమని చెబితే షాక్ ట్రీట్మెంట్లకు పాల్పడ్డారు.

Read Also: Srisailam Trust Board: శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ భేటీ.. 25 ప్రతిపాదనలకు ఓకే

కాంబోడియాలో ఉద్యోగం అంటూ అక్కడికెళ్లిన యువకులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాంబోడియా బాధితుల్లో తిరుపతి కుర్రాడు అభ్యుదయ్ వున్నాడు. స్థానిక పోలీసుల సహకారంతో అతి కష్టం మీద కాంబోడియా నుంచి స్వదేశానికి చేరుకున్న అభ్యుదయ్ తిరుపతి ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేశాడు. పాండిచ్చేరికి చెందిన ఓ కన్సల్టెన్సీ సాయంతో నెలన్నర క్రితం కాంబోడియా దేశానికి వెళ్ళాడు అభ్యుదయ్. కాంబోడియాలో అభ్యుదయ్ కు ఆన్లైన్లో చాటింగ్ ద్వారా అబ్బాయిలను మోసం చేసే ఉద్యోగం లభించింది. అమ్మాయిల రూపంలో చాటింగ్ చేస్తూ అబ్బాయిలను మోసగించి వారి నుంచి వీలైనంత దండుకావాలని అభ్యుదయ్ కు టార్గెట్ ఫిక్స్ చేశారు.

చెప్పిన పని చేయకపోతే ఎలక్ట్రికల్ గన్ తో కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేవారని అభ్యుదయ్ పోలీసులకు తెలిపాడు. స్థానిక పోలీసుల సహకారంతో అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకొని ఇండియా వచ్చానని అంటున్నాడు అభ్యుదయ్. చాలామంది ఇండియన్స్ కంబోడియాలో ఇదే ఉద్యోగంలో చిక్కుకొని తీవ ఇబ్బందులు పడుతున్నారని అభ్యుదయ్ చెబుతున్నాడు. పాండిచ్చేరికి చెందిన ఏజెన్సీ తమను నిలువునా మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్

Exit mobile version