Site icon NTV Telugu

Fraud: రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

Job Offer

Job Offer

Fraud: గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి. దొంగ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపి, దొంగ అధికారులతో విచారణ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: Minister Ramprasad Reddy: అన్న క్యాంటీన్‌లో అక్కడ ఉచితంగా ఆహారం.. ఒక్క రూపాయి కూడా వద్దు..

ఉద్యోగాల పేరుతో బాపట్ల, పెదనందిపాడు, గుంటూరు, చిలకలూరిపేటలకు చెందిన యువత మోసపోయినట్లు తెలిసింది. నకిలీ ఉద్యోగాలు అని తెలుసుకుని బాధితులు నిలదీసినట్లు తెలుస్తోంది. డబ్బు ఇవ్వను చేతనైంది చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని గుంజి శ్రీనివాసరావుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందనలో జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు.

Exit mobile version